భగవంతుని స్వరూపము - సచ్చిదానంద మూర్తి; పూర్ణుడుగా నుండుట, స్వకీయమగు రూపము.
ఆత్మాహి నామ స్వరూపమేవ. ఆత్మానాం సద్రూపేణ సామాన్యతః విజానాతి లోకః - పరంతు, న కోపి ప్రజ్ఞాన ఘనో, అఖండానందస్వరూపో, వ్యాపకో, నిత్య శుద్ధో, నిత్య ముక్తశ్చ అహం “ఇతి విశేషరూపేణ ఆత్మానం జానాతి. తస్మాత్ చిదానందాది లక్షణ లక్షితత్వేన విశేషతః న ఆత్మా విజ్ఞాయతే. కింతు, సామాన్యతః స్వస్వరూపేణ జ్ఞాయతే. ఏవ, పామరాది సర్వసాధారణ్యేన భాసమానం సద్రూపం ఆత్మనః సామాన్య స్వరూపమితి ఉచ్యతే. కేవల బ్రహ్మానుభవసిద్ధ చిదానందాది స్వరూపంతు విశేష రూపం”.
(ఆత్మ అనగా స్వస్వరూపమే - ఆత్మయ స్వస్వరూపము - లోకము - లోకులు - అతనిని సామాన్యముగా సత్పదార్థముగా తెలుసుకొనుచున్నది - ‘సత్’ అనగా మూడుకాలములందుండునది - నశించనది- అంతేగాని “ప్రజ్ఞాఘనుడు, అఖండానందస్వరూపుడు - నిత్య సుఖమగు మోక్షరూపుడు, వ్యాపనశీలుడు - (అన్నింటియందు వ్యపించి యుండువాడు), నిత్యశుద్ధుడు - ప్రకృతి, దాని కార్యములతో కలియక ఉండువాడు - ప్రకృతికి సంబంధించిన ఉపాధులలో ఉన్నను దానినంటకయుండుటచేత దాని దోషములు తనకి అంటనందున శుద్ధుడైనవాడు - నిత్యముక్తుడు (ఏ విధమైన బంధములు ఎప్పుడును లేనివాడు - అగు భగవంతుడే నేను” అను విశేషరూపముగలది ఆత్మ యని ఎవరును ఎఱుగరు. అందుచేత చిదానందాది లక్షణములు అను విశేషము గలది ఆత్మ యని తెలియదు - కాని, సామాన్య ముగా స్వస్వరూపము చేతనే తెలియబడుచున్నాడు - పామరులు (అజ్ఞానులు) మొదలగువారు సద్రూపమే ఆత్మయొక్క సామాన్యరూపము అని చెప్పుకొనుచున్నారు. కేవలము బ్రహ్మానుభవము వల్ల సిద్ధించు చిదానందము మొదలగునవిగల స్వరూపము విశేషరూపము).
(ఆదిత్య శబ్దః ‘ణ్య’ ప్రత్యయాంతోమండలవాచీ - “య యేష ఏతస్మిన్ మండలే పురుషః” ఇతి బృహదారణ్యకే పురుషస్య మండలవర్తిత్వ శ్రవణాత్ - హిరణ్మయ శబ్దః రమణీయత్వ పరః - దృశ్యతే యోగిభిః ఇత్యర్థః –
“దృశ్యతే త్వ గ్రయ్యా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః” ఇతి శృత్యైకార్ధాత్ ||.
(బృహదారణ్య కోపనిషత్తులో ఇట్లు చెప్పబడినది - “ఈ సూర్య మండలమందుండు పురుషుడు” అందుచేత ఆదిత్యుని వర్ణము గలవాడు, అనగా, సూర్యమండలములో నుండువాడు; సూర్యమండలములోనుండి దానికి ఆ తేజస్సు, ఆ వేడిమి, కాంతి కలుగచేయువాడు (Energy ని ఇచ్చి కిరణములచే radiate చేయువాడు - సూర్యమండలములోని అణువణువులోనుండు శక్తి (Energy) Helium గా మారుటవలన సూర్యమండలమునకు ఆ తేజస్సు, వేడిమి, కాంతి కలుగుచున్నది. ఆ శక్తియే భగవంతుని రూపము, లేక, అదియే శక్తిరూపములో నున్న భగవంతుడు -“తమసః పరస్తాత్” అనగా చీకటికి పరుడైనవాడు - తన కాంతితో (తేజస్సుతో) చీకటిని తొలగించువాడు - వెలుగు కలుగచేయువాడు - ఇట్లు చెప్పుటవలన తేజోరూపము భగవంతుని స్వరూపము. “హిరణ్మయః అనగా” రమణీయమైన రూపము - బంగారు మయమైన రూపము - లేక ప్రపంచమును పుట్టించి, పోషించుటకు తగిన శక్తియే రూపముగా గలవాడు. అట్టి రూపము సాధారణులకు కనబడదు, యోగులకే కనబడునది. ఈ విషయము శ్రుతి ఇట్లు చెప్పుచున్నది : - ఈ పురుషుడు సమస్త భూతములందు గూఢమైన శరీరము (ఆకారము) గలవాడై యున్నాడు. అందుచేత అతని రూపము అందఱకు కనబడదు - కాని సూక్ష్మాతి సూక్ష్మమైనవస్తువులను చూడగలుగు యోగులు వారి సూక్ష్మ బుద్ధితోను, సూక్ష్మ దృష్టితోను భగవంతుని స్వరూపమును చూడగలుగుచున్నారు - ప్రతి వస్తువులోనుండి సూక్ష్మాతి సూక్ష్మమగుటవలన ప్రతివారికి కనబడక సూక్ష్మ దృష్టిగల యోగీశ్వరులకు కనబడునదే భగవంతుని స్వరూపము - అదియే స్వస్వరూపము).
గాత్మ భూతుండ వైనట్టి నీవు నసత్ప్రకాశరూపంబులై కలుగు మాయ
కేంద్రియంబులచేత, నీశ్వర !నీ మాయనొందించి, పంచభూతోప లక్షి
తంబగు దేహి విధంబున గానంగ బడుదువు గాని యేర్పడిన శుద్ధ
తే. సత్వగుణ యుక్తమైన భాస్వత్స్వరూప
ధరుడవై గానబడవుగా, పరమపురుష
యద్యయానంద, గోవింద! - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 7 - 191)
నాకులకును నురగపతి పినాకులకైనన్
వాకొనగం దలపోయను
రాకుండు మదీయ రూప రమ్యత్వంబుల్“. (శ్రీమహాభాగవతము - 3 - 9 - 323)
bhagavaṃtuni svarūpamu - saccidānaṃda mūrti; pūrṇuḍugā nuṃḍuṭa, svakīyamagu rūpamu.
ātmāhi nāma svarūpamēva. ātmānāṃ sadrūpēṇa sāmānyataḥ vijānāti lōkaḥ - paraṃtu, na kōpi prajñāna ghanō, akhaṃḍānaṃdasvarūpō, vyāpakō, nitya śuddhō, nitya muktaśca ahaṃ “iti viśēṣarūpēṇa ātmānaṃ jānāti. tasmāt cidānaṃdādi lakṣaṇa lakṣitatvēna viśēṣataḥ na ātmā vijñāyatē. kiṃtu, sāmānyataḥ svasvarūpēṇa jñāyatē. ēva, pāmarādi sarvasādhāraṇyēna bhāsamānaṃ sadrūpaṃ ātmanaḥ sāmānya svarūpamiti ucyatē. kēvala brahmānubhavasiddha cidānaṃdādi svarūpaṃtu viśēṣa rūpaṃ”.
(ātma anagā svasvarūpamē - ātmaya svasvarūpamu - lōkamu - lōkulu - atanini sāmānyamugā satpadārthamugā telusukonucunnadi - ‘sat’ anagā mūḍukālamulaṃduṃḍunadi - naśiṃcanadi- aṃtēgāni “prajñāghanuḍu, akhaṃḍānaṃdasvarūpuḍu - nitya sukhamagu mōkṣarūpuḍu, vyāpanaśīluḍu - (anniṃṭiyaṃdu vyapiṃci yuṃḍuvāḍu), nityaśuddhuḍu - prakṛti, dāni kāryamulatō kaliyaka uṃḍuvāḍu - prakṛtiki saṃbaṃdhiṃcina upādhulalō unnanu dāninaṃṭakayuṃḍuṭacēta dāni dōṣamulu tanaki aṃṭanaṃduna śuddhuḍainavāḍu - nityamuktuḍu (ē vidhamaina baṃdhamulu eppuḍunu lēnivāḍu - agu bhagavaṃtuḍē nēnu” anu viśēṣarūpamugaladi ātma yani evarunu eṟugaru. aṃducēta cidānaṃdādi lakṣaṇamulu anu viśēṣamu galadi ātma yani teliyadu - kāni, sāmānya mugā svasvarūpamu cētanē teliyabaḍucunnāḍu - pāmarulu (ajñānulu) modalaguvāru sadrūpamē ātmayokka sāmānyarūpamu ani ceppukonucunnāru. kēvalamu brahmānubhavamu valla siddhiṃcu cidānaṃdamu modalagunavigala svarūpamu viśēṣarūpamu).
(āditya śabdaḥ ‘ṇya’ pratyayāṃtōmaṃḍalavācī - “ya yēṣa ētasmin maṃḍalē puruṣaḥ” iti bṛhadāraṇyakē puruṣasya maṃḍalavartitva śravaṇāt - hiraṇmaya śabdaḥ ramaṇīyatva paraḥ - dṛśyatē yōgibhiḥ ityarthaḥ –
“dṛśyatē tva grayyā buddhyā sūkṣmayā sūkṣmadarśibhiḥ” iti śṛtyaikārdhāt ||.
(bṛhadāraṇya kōpaniṣattulō iṭlu ceppabaḍinadi - “ī sūrya maṃḍalamaṃduṃḍu puruṣuḍu” aṃducēta ādityuni varṇamu galavāḍu, anagā, sūryamaṃḍalamulō nuṃḍuvāḍu; sūryamaṃḍalamulōnuṃḍi dāniki ā tējassu, ā vēḍimi, kāṃti kalugacēyuvāḍu (Energy ni icci kiraṇamulacē radiate cēyuvāḍu - sūryamaṃḍalamulōni aṇuvaṇuvulōnuṃḍu śakti (Energy) Helium gā māruṭavalana sūryamaṃḍalamunaku ā tējassu, vēḍimi, kāṃti kalugucunnadi. ā śaktiyē bhagavaṃtuni rūpamu, lēka, adiyē śaktirūpamulō nunna bhagavaṃtuḍu -“tamasaḥ parastāt” anagā cīkaṭiki paruḍainavāḍu - tana kāṃtitō (tējassutō) cīkaṭini tolagiṃcuvāḍu - velugu kalugacēyuvāḍu - iṭlu ceppuṭavalana tējōrūpamu bhagavaṃtuni svarūpamu. “hiraṇmayaḥ anagā” ramaṇīyamaina rūpamu - baṃgāru mayamaina rūpamu - lēka prapaṃcamunu puṭṭiṃci, pōṣiṃcuṭaku tagina śaktiyē rūpamugā galavāḍu. aṭṭi rūpamu sādhāraṇulaku kanabaḍadu, yōgulakē kanabaḍunadi. ī viṣayamu śruti iṭlu ceppucunnadi : - ī puruṣuḍu samasta bhūtamulaṃdu gūḍhamaina śarīramu (ākāramu) galavāḍai yunnāḍu. aṃducēta atani rūpamu aṃdaṟaku kanabaḍadu - kāni sūkṣmāti sūkṣmamainavastuvulanu cūḍagalugu yōgulu vāri sūkṣma buddhitōnu, sūkṣma dṛṣṭitōnu bhagavaṃtuni svarūpamunu cūḍagalugucunnāru - prati vastuvulōnuṃḍi sūkṣmāti sūkṣmamaguṭavalana prativāriki kanabaḍaka sūkṣma dṛṣṭigala yōgīśvarulaku kanabaḍunadē bhagavaṃtuni svarūpamu - adiyē svasvarūpamu).
gātma bhūtuṃḍa vainaṭṭi nīvu nasatprakāśarūpaṃbulai kalugu māya
kēṃdriyaṃbulacēta, nīśvara !nī māyanoṃdiṃci, paṃcabhūtōpa lakṣi
taṃbagu dēhi vidhaṃbuna gānaṃga baḍuduvu gāni yērpaḍina śuddha
tē. satvaguṇa yuktamaina bhāsvatsvarūpa
dharuḍavai gānabaḍavugā, paramapuruṣa
yadyayānaṃda, gōviṃda! - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 7 - 191)
nākulakunu nuragapati pinākulakainan
vākonagaṃ dalapōyanu
rākuṃḍu madīya rūpa ramyatvaṃbul”. (śrīmahābhāgavatamu - 3 - 9 - 323)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.