(ఈ సర్వ ప్రపంచము మనకందఱికి కనబడుచున్నది భగవంతుని రూపమే - భగవంతునికంటె వేరుగా ప్రపంచమువలె మనకు కనబడుచున్నప్పటికీ అది భగవంతుని రూపమే. అందుచేత ఈ ప్రపంచము వాస్తవముగా భగవతుడే - అందుచేత దాని వాస్తవరూపము భగవంతుడే.
మయ్యేవ సంస్థితం నష్టం మత్సమో నాధికస్సదా ||.
(నేనే పరతత్వమును. ఈ జగత్తు నానుండి పుట్టినది, నాయందే యున్నది, నాయందే లీనమగుచున్నది. నాతో సమానమైనవాడుకాని అధికుడుకాని లేడు).
(ఆత్మతత్వమును తెలిసినయడల ఆతత్వమే కేవలుడగు పరబ్రహ్మ - ప్రకృతితో కలియని నిరాకార, నిర్గుణ, నిర్విశేష పరబ్రహ్మ - సృష్టి అంతటిలోనున్న సమస్త వస్తువులు భగవత్తత్వములే - “తత్వమసి” అను మహావాక్యములోని తత్ + త్వం = తత్వం = ఆది, ఆ పరమాత్మ; త్వం = నేనే - అనగా అది నీవు ఒకే తత్వము - ఒకటే -).
(ī sarva prapaṃcamu manakaṃdaṟiki kanabaḍucunnadi bhagavaṃtuni rūpamē - bhagavaṃtunikaṃṭe vērugā prapaṃcamuvale manaku kanabaḍucunnappaṭikī adi bhagavaṃtuni rūpamē. aṃducēta ī prapaṃcamu vāstavamugā bhagavatuḍē - aṃducēta dāni vāstavarūpamu bhagavaṃtuḍē.
mayyēva saṃsthitaṃ naṣṭaṃ matsamō nādhikassadā ||.
(nēnē paratatvamunu. ī jagattu nānuṃḍi puṭṭinadi, nāyaṃdē yunnadi, nāyaṃdē līnamagucunnadi. nātō samānamainavāḍukāni adhikuḍukāni lēḍu).
(ātmatatvamunu telisinayaḍala ātatvamē kēvaluḍagu parabrahma - prakṛtitō kaliyani nirākāra, nirguṇa, nirviśēṣa parabrahma - sṛṣṭi aṃtaṭilōnunna samasta vastuvulu bhagavattatvamulē - “tatvamasi” anu mahāvākyamulōni tat + tvaṃ = tatvaṃ = ādi, ā paramātma; tvaṃ = nēnē - anagā adi nīvu okē tatvamu - okaṭē -).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.